
పార్టీలో చేరిన లక్ష్మారెడ్డితో షబ్బీర్‌అలీ
సాక్షి, కామారెడ్డి/మాచారెడ్డి: రాష్ట్రంలో అహంకార, కుటుంబ పాలనను గద్దెదింపేందుకు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సీపీఐ, జనసమితి పార్టీలతో జతకట్టిందని శాసన మండలి ప్రతిపక్ష నేత, కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ అన్నారు. ఆదివారం మాచారెడ్డి మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మారెడ్డితో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే పింఛన్లు ఆగిపోతాయంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు పింఛన్‌దారులను బెదిరింపులకు గురిచేస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొడతామన్నారు.
మాచారెడ్డి మండలంలో జెం డాలు కట్టేవారు లేరని కేటీఆర్ అన్నాడని, ఇప్పుడు ఆయన పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు, ఆయన అనుచరులే తమ పార్టీలోకి వచ్చారని పేర్కొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వీఎల్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని, కామారెడ్డిలో తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులపైనే టీఆర్‌ఎస్ నేతలు దాడులు చేశారన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు నజీరొద్దీన్,రామస్వామిగౌడ్, సీపీఐ నాయకులు దశరత్, బాల్‌రాజు, కాంగ్రెస్ నేతలు ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, నల్లవెల్లి అశోక్, పంపరి శ్రీనివాస్, రమేశ్‌గౌడ్, ఫిరంగి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment