
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ బడ్డెట్‌ను ప్రవేశ పెట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ.. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు బడ్జెట్ తక్కువగా కేటాయించిందని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పలేదన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి కేటాయింపుపై బడ్జెట్‌లో ప్రస్తావన లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ కేటాయింపులో గత బడ్జెట్ కంటే సుమారు 100 కోట్లకుపైగా తగ్గించారని చెప్పారు.
రుణమాఫీ ఏక కాలంలో చేస్తారా.. విడతల వారిగా చేస్తారా అన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. మొన్నటి అకాల వర్షం వలన జరిగిన పంట నష్టానికి ఇప్పటి వరకు కనీసం పర్యవేక్షణ చేయలేదని మండిపడ్డారు. ధరణి వెబ్ సైట్ పనిచేయడం లేదని తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు బడ్జెట్లో డబ్బులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. తండాలు గ్రామ పంచాయతీలుగా చేశారు కానీ బడ్జెట్లో డబ్బులు కేటాయించలేదన్నారు. విద్య, వైద్యానికి బడ్జెట్‌లో డబ్బులు తక్కువగా కేటాయించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment