శాసన మండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న టీఆర్‌ఎస్ పోలీసులను వాడుకొని ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, శాసన మండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఆరోపించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు లేఖ రాశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌లో జాయిన్ ఐతే కేసులు తీసేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని, తన అనుమతి లేకుండానే టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై గవర్నర్ చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని కోరారు.
టీఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోయింది
అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోయిందని షబ్బీర్ అలీ అన్నారు. దీంతో కేసీఆర్‌కి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయం వరకు టీఆర్‌ఎస్ గ్రాఫ్ మరింత పడిపోతుందన్నారు. శాసనమండలి ఎప్పుడు నిర్వహిస్తారో అధికారులకు క్లారిటీ లేదని విమర్శించారు. జగ్గారెడ్డికి బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామని షబ్బీర్ పేర్కొన్నారు. వచ్చేది కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అని షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment