సమావేశంలో మాట్లాడుతున్న శాసనమండలి విపక్షనేత షబ్బీర్ అలీ
సాక్షి, కామారెడ్డి : రాష్ట్రం కోసం ఎన్నడూ పోరాడని కేటీఆర్‌కు మంత్రి పదవి వచ్చింది గని, రాష్ట్రం వస్తే ఉద్యోగాలొస్తయని ఆశపడ్డ నిరుద్యోగులను నాలుగేళ్లుగా మోసపూరిత మాటలతో వంచించారని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సత్యగార్డెన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ కాలంలో తన కొడుకు, కూతురు అమెరికాలోనే ఉంటరని, తాను సీఎం పదవిని తీసుకోనని, దళితుడినే సీఎంని చేస్తానని మాటలు చెప్పిన సీఎం కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడికి పదవులు ఇచ్చాడని, ఇటీవలే తోడల్లుని కొడుక్కి కూడా ఎంపీ పదవి ఇచ్చుకున్నాడని విమర్శించారు. రాహుల్‌గాంధీని మంత్రి కేటీఆర్ విమర్శించడం సరికాదన్నారు.
రాజీవ్‌గాంధీ 1989లో చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఎన్ని సార్లు అధికారంలోకి వచ్చినా సోనియాగాంధీగాని, రాహుల్‌గాంధీగాని పీఎం అయ్యే అవకాశాలు ఉన్నా పదవులు తీసుకోలేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందని సీఎం కేసీఆర్ శాసన మండలిలో పేర్కొన్నాడన్నారు. ఎన్నికలకు ఎప్పుడైనా కాం గ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తానంటాడని, ఆయన చేతిలో రాయి ఎప్పుడు ఎటువైపు పడు తుందో ఆయనకే తెలియాలన్నారు.
రాష్ట్రంలో ని రుద్యోగులు ఇబ్బందులు పడుతున్నా ప్రభు త్వం కనికరించడం లేదన్నారు. ఇటీవల తాము టాటా కంపెనీ సాయంతో ఉద్యోగమేలా నిర్వహిస్తే 30 వేల మంది నిరుద్యోగులు వచ్చారని తెలిపారు. వారిలో 1800 మందిని ఎంపిక చేశారని, విడతల వారీగా వారికి ఉద్యోగాల కోసం శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర చైర్మన్ కే.మదన్‌మోహన్‌రావ్, నాయకులు నల్లమడుగు సురేందర్, కైలాస్ శ్రీనివాస్‌రావ్, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, మామిండ్ల అంజయ్య, పండ్ల రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment