
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహించలేమని చేతులెత్తేసిన అసమర్థుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. సీఎం అసమర్థతతో ప్రభుత్వం చేతకానితనం బయట పడిందని గురువారం మండిపడ్డారు.
సైన్స్ కాంగ్రెస్ మణిపూర్‌కు తరలిపోవడం రాష్ట్రానికి అవమానమని, ఇది విద్యారంగానికి బ్లాక్ డే అని వ్యాఖ్యానించారు. ఉద్యమంలో త్యాగాలు చేసిన విద్యార్థులపై, ఓయూపై కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఓయూలో రౌడీలు, టెర్రరిస్టులు ఉన్నారని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. సదస్సు నిర్వహించకపోవడంతో యూనివర్సిటీకి రూ.1,000 కోట్ల నష్టం జరిగిందన్నారు.