
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు నివాళి అర్పించే సమయం కూడా లేదా అని మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్‌లో మాజీ మంత్రి శ్రీధర్ బాబుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని కేసీఆర్ గతేడాది ప్రకటించారని, ఆ విగ్రహం ఎక్కడని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు దళితులు, బడుగు, బలహీన వర్గాలంటే చిన్న చూపని, అంబేడ్కర్, పూలే, జగ్జీవన్‌రామ్‌లకు నివాళులర్పించడం ఆయనకు ఇష్టం ఉండదని విమర్శించారు. రూ.300 కోట్లతో కట్టుకున్న ప్రగతిభవనే ప్రపంచంగా ఆయన గడుపుతున్నారని, రైతుల పంట నష్టం జరిగినా పరామర్శించడం లేదని ఆరోపించారు.