
గోదావరిఖని(రామగుండం): సింగరేణి మనుగడ ఏఐటీ యూసీ, ఐఎన్‌టీయూసీ కూటమితోనే సాధ్యమని శాసన మండలి కాంగ్రెస్ పక్ష నేత, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీబీజీకేఎస్ ఏ ఒక్క కార్మిక సమస్యలను పరిష్కరించలేదన్నారు.
టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే తాడిచర్లతో పాటు మిగతా గనులను కూడా పూర్తిగా ప్రైవేట్‌పరం చేస్తారని ఆరోపించారు. దసరాకు టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే దీపావళికి వారసత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ టీఆర్‌ఎస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారని. కానీ దీనిపై బాండ్ రాసిస్తేనే కార్మి కులు నమ్ముతారని అన్నారు. సింగరేణి సీఎండీ టీఆర్‌ఎస్ పార్టీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని, గనులన్నీ బార్‌షాపులుగా మారిపోయినా ఆయన చూస్తూ ఉండిపోయారని విమర్శించారు.