
సాక్షి, హైదరాబాద్: ‘ఒక దేశం.. ఒక పన్ను’అంటున్న కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేకపోవడం ఏమిటని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా రాష్ట్రంలో మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరుగుతున్నాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు.
మంగళవారం మండలిలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని లేనిపక్షంలో వాటిపై రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యాట్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.