![Shabbir Ali Comments On Municipal Elections In Kamareddy - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/16/shabbir-ali.jpg.webp?itok=CrXM-uCy)
సాక్షి, కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకోలేదని, మమ్మల్ని కొనే దమ్ము ఎవరికీ లేదని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బిర్ అలీ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై కోర్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నాలుగైదు చోట్ల బలమైన అభ్యర్థులు ఉండటం వల్ల కొందరికి న్యాయం చేయలేకపోయామని పేర్కొన్నారు. వారి సేవలను తప్పకుండా వినియోగించుకుంటామని తెలిపారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కైలాస్ నీలిమ శ్రీనివాస్‌ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీకి చైర్మన్ అభ్యర్థిని ప్రకటించే దమ్ముందా అని సూటిగా ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో కామారెడ్డిలో 40 స్థానాల వరకు గెలుచుకుంటామని షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment