దోమకొండ (కామారెడ్డి): హైదరాబాద్‌లో మెట్రో రైలు ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా మందాపూర్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్ కేబినెట్‌లో తాను హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నానని, ఆ సమయంలోనే మెట్రో కోసం ఒప్పందం జరిగిందని, శంకుస్థాపన చేశామని గుర్తుచేస్తూ అప్పటి ఫొటోను చూపించారు. ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ముందు చూపుతో హైదరాబాద్ అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. వైఎస్సార్ రోజూ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసేవారన్నారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ తన కేబినెట్‌లోని మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా సమ యం ఇవ్వడం లేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment