
జిల్లా కేంద్రంలో మాట్లాడుతున్న షబ్బీర్‌అలీ
సాక్షి, కామారెడ్డి రూరల్: డబుల్ బెడ్‌రూం ఇండ్ల పేరుతో ప్రజలను మభ్య పెట్టి ఓట్లు దండుకున్న టీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ అన్నారు. బుధవారం మండలంలోని అడ్లూర్ జీపీ పరిధిలోని డ్రైవర్స్, గుమాస్తా, బీడీ వర్కర్స్ కాలనీ, రామేశ్వర్‌పల్లిల్లో ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల ప్రజలు షబ్బీర్‌అలీకి బోనాలు, డప్పువాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. జెడ్పీటీసీ నిమ్మమోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పెరుమండ్ల రాములు, ఎంపీటీసీ నిమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, భూమని బాల్‌రాజు, మర్కంటి శంకర్, ఉరుదొండ నరేష్, గరిగె పద్మ నర్సాగౌడ్, సమద్, రవిపాటిల్, సుంకరి శ్రీనివాస్, బాలకిషన్, చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు.
టేకేదార్ల సమస్యలను పరిష్కరిస్తాం
కామారెడ్డి : టీఆర్‌ఎస్ పాలనలో ప్రశ్నించే హక్కును ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కాలరాశారని కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం నియోజకవర్గానికి చెందిన టేకేదార్లు కాంగ్రెస్‌లో చేరారు. షబ్బీర్‌అలీ మాట్లాడుతూ టేకేదార్ల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీరనున్నాయన్నారు. వారి సమస్యలను మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ఈసారి గెలిస్తే ఉన్నత పదవిలో ఉండడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన 13వ వార్డు యువకులు
కామారెడ్డి టౌన్: పట్టణంలోని 13వ వార్డుకు చెందిన యువకులు బుధవారం కాంగ్రెస్ నాయకుడు రవీందర్‌గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ షబ్బీర్ అలీ యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే యూసూఫ్ అలీ, కౌన్సిలర్ నిమ్మ దామోదర్‌రెడ్డి, కారంగుల అశోక్‌రెడ్డి, నర్సింలు ఉన్నారు.
కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం
రాజంపేట: మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటా ప్రచారం చేశారు. షబ్బీర్‌అలీని గెలిపించాలని కోరుతూ కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో మోసపూరిత వాగ్దానాలతో కాలం వెళ్లదీసిందని, బూటకపు మాటలతో ప్రజలను మోసం చేసిన పార్టీకి తమ ఓటుతో గుణపాఠం చెప్పాలని కోరారు. పెద్దపల్లి వీరన్న, ఇంతియాజ్‌అలీ, అక్బర్, భీమయ్య, గంగయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment