టీఆర్‌ఎస్ నేత గంప గోవర్ధన్, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ
కామారెడ్డి: జిల్లాలో రాజకీయంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీఆర్‌ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌లు ఆస్తులపై బహిరంగ చర్చకు సవాళ్లు విసురుకున్నారు. గంప గోవర్థన్ తన ఆస్తులు ఇవిగో అంటూ కామారెడ్డి మార్కెట్ యార్డులోని గాంధీ విగ్రహం వద్దకు వచ్చి హడావిడి చేశారు. తన ఆస్తుల చిట్టా, షబ్బీర్ ఆస్తుల చిట్టా చదివి వినిపించారు. జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ ఉందని చెప్పి తప్పించుకోవడం సరికాదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆయన వెళ్లిన కాసేపటికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కూడా తన అనుచరులతో గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ..తనది తెరిచిన పుస్తకమన్నారు. ప్రతీ పైసాకు లెక్క ఉందని, ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నానని తెలిపారు. చర్చలకు అనుమతి లేదని కామారెడ్డి ఎస్పీ శ్వేతా రెడ్డి నేతలకు సూచించారు. ఇటీవల రోడ్‌షోలో గంప గోవర్థన్ ఆస్తులపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment