న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరి ఘటనలో ముందస్తు కుట్ర జరిగిందని సిట్ స్పష్టీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాపై విపక్షాల డిమాండ్లు వెల్లువెత్తాయి. అయినా సరే మంత్రి రాజీనామా ప్రసక్తే లేదని బీజేపీ కరాఖండిగా చెప్పేసింది. లఖీంపూర్ హింసాత్మక ఘటన ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ అంశాన్ని పార్లమెంట్‌లో చర్చించకూడదని సీనియర్ నేత పియూశ్ గోయల్ అన్నారు.
చదవండి: లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ
లఖీంపూర్ ఘటనలో మంత్రి అజయ్ కుమారుడు నిందితుడిగా ఉన్నారు. ‘ మోదీ సర్కార్‌ను విమర్శించడానికి సరైన కారణాలు లేకనే విపక్షాలు ఇలా సస్పెండ్ అయిన సభ్యుల అంశాన్ని పదేపదే పార్లమెంట్‌లో లేవనెత్తుతున్నాయి’ అని గోయల్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment