Abortion: గర్భ విచ్ఛిత్తి గడువు పెంపు.. 20 నుంచి 24 వారాలు | Centre Notifies Abortion Till 24 Weeks Of Pregnancy Over Special Cases | Sakshi
Sakshi News home page

Abortion: గర్భ విచ్ఛిత్తి గడువు పెంపు.. 20 నుంచి 24 వారాలు

Published Thu, Oct 14 2021 11:19 AM | Last Updated on Thu, Oct 14 2021 11:20 AM

Centre Notifies Abortion Till 24 Weeks Of Pregnancy Over Special Cases - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గర్భ విచ్ఛిత్తిపై కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధనలను తీసుకొచి్చంది. ఈ మేరకు మార్చి నెలలో పార్లమెంట్‌ ఆమోదించిన మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ(సవరణ) చట్టం–2021ను నోటిఫై చేసింది. కొన్ని వర్గాల మహిళలు గర్భ విచ్ఛిత్తి చేసుకోవడానికి గరిష్ట పరిమితిని 20 వారాల నుంచి 24 వారాలకు పెంచుతున్నట్లు పేర్కొంది.

ఈ చట్టం ప్రకారం.. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, మైనర్లు, గర్భధారణ సమయంలో వైధవ్యం పొందడం, విడాకులు తీసుకోవడం, మానసిక అనారోగ్యం ఉన్నవారు, పిండం పూర్తిగా రూపం దాల్చని పరిస్థితుల్లో ఉన్నవారు, ప్రభుత్వం ఆత్యయిక స్థితిని ప్రకటించినపుడు, విపత్తు సమయాల్లో గర్భం దాల్చిన వారు 24 వారాల్లోగా గర్భ విచ్ఛిత్తి చేసుకోవచ్చు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement