సాక్షి, ముంబై: భవానీమాతకు పూజచేసి తీసుకొచ్చిన కంక ణాన్ని శివసైనికులకు పంపిణీ చేసినంత మాత్రాన ఒరిగేదేమీలేదంటూ శివసేనను పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎద్దేవా చేసింది. సైన్‌లోని సోమయ్య మైదానంలో గురువారం జరిగిన ప్రతిజ్ఞాదివస్ ర్యాలీలో శివసైనికులకు కంకణం పంపిణీచేసి ప్రతిజ్ఞ చేయించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ శుక్రవారం ఉద్ధవ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘ఎర్ర కోటపై కాంగ్రెస్ తరఫున ప్రధాని మన్మోహన్ సింగ్ జెండా ఎగరవేయడం, ప్రసంగించడం ఇదే చివరిసారని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
మరి పంద్రాగస్టు మినహా గణతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం ఉండదనే విషయం ఉద్ధవ్‌కు తెలియదా? అంటూ చురకలంటించారు. నరేంద్ర మోడీకి దగ్గరైన తరువాత ఉద్ధవ్ బుకాయించడం నేర్చుకున్నారంటూ విమర్శించారు. ‘బాల్‌ఠాక్రే జీవించి ఉన్న సమంయలో ఎక్కడో చేసిన ప్రసంగపు సీడీని ప్రదర్శించారు. ఆ తరువాత ఉద్ధవ్ స్వయంగా శివసైనికులచేత ప్రతిజ్ఞ చేయించారు. శివసైనికులపై ఆయనకు నమ్మకం లేదనే విషయం దీనినిబట్టి తేలిపోయింది. కొద్దిరోజులుగా అనేకమంది పదాధికారులు, కార్యకర్తలు పార్టీని విడిచి వెళుతున్నారు. వారికి శివ్‌బంధన్ పేరుతో కంకణం కట్టి పార్టీ నుంచి బయటపడకుండా ఉద్ధవ్ జాగ్రత్తపడుతున్నారు’ అని నవాబ్ అన్నారు.
అలా చేస్తే అతుక్కుపోరు
చేతి మణికట్టుకు దారం కట్టి ప్రతిజ్ఙ చేయించినంత మాత్రాన పార్టీకి కార్యకర్తలు అతుక్కుపోరంటూ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఉద్ధవ్‌కు చురకలంచారు. ‘ఎంపీ, ఎమ్మెల్యేలు, పదాధికారులు, కార్యకర్తలు పార్టీలోనే కొనసాగేందుకు కంకణం కట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది. ఒకసారి ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని పవార్ సలహా ఇచ్చారు. బాల్‌ఠాక్రే సభలో లేకపోయినప్పటికీ ఆయన ప్రతిజ్ఞను సీడీ ద్వారా వినిపించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని నిలదీశారు. ఉద్ధవ్‌కు పార్టీపై పట్టులేదనే విషయం దీనినిబట్టి స్పష్టమైందన్నారు.
కంకణాలతో ఒరిగేదేమీ లేదు
Published Sat, Jan 25 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement
Advertisement