Aryan Khan Drug's Case: ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమని కుదిపేస్తోంది షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు. ఈ కేసులో ఆర్యన్ పెట్టిన బెయిల్ పిటిషన్‌ని ఇప్పటికే మూడు సార్లు రిజెక్ట్ చేయగా.. మంగళవారం మరోసారి విచారణ జరగనుంది. ఈ తరుణంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు.
ఇటీవల కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే ఓ ముస్లీం అని, సర్టిఫికేట్‌లని ఫోర్జరీ చేసి తన మతం గురించి దాచాడని నవాబ్ ఆరోపించారు. ఆయన అసలు పేరు సమీర్ దావూద్ వాంఖడే అని తెలిపిన మంత్రి.. తాజాగా నవాబ్ మరోసారి వాంఖడేపై విరుచుకుపడ్డారు.
వాంఖడే బాలీవుడ్ నటుల ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించాడు. అనంతరం డబ్బు డిమాండ్ చేసేవారన్నారు. దీనికి సంబంధించిన ఓ లేఖను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది పేరు లేని ఎన్‌సీబీ ఆఫీసర్ పేరుతో ఆయనకి పంపించారని అందులో తెలిపారు. దీన్ని వాంఖడేపై విచారణలో భాగం చేయాలని ఎన్‌సీబీ ఉన్నతాధికారులు రిక్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు.
చదవండి: ‘రూ.25 కోట్ల డిమాండ్’పై విజిలెన్స్ దర్యాప్తు
Here are the contents of the letter received by me from an unnamed NCB official.
As a responsible citizen I will be forwarding this letter to DG Narcotics requesting him to include this letter in the investigation being conducted on Sameer Wankhede pic.twitter.com/SOClI3ntAn
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 26, 2021
Comments
Please login to add a commentAdd a comment