మమతకే మద్దతు, కేజ్రీవాల్కు లేదు: హజారే | Arvind Kejriwal never responded to my letter says Anna Hazare | Sakshi
Sakshi News home page

మమతకే మద్దతు, కేజ్రీవాల్కు లేదు: హజారే

Published Wed, Feb 19 2014 3:30 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

మమతకే మద్దతు, కేజ్రీవాల్కు లేదు: హజారే - Sakshi

మమతకే మద్దతు, కేజ్రీవాల్కు లేదు: హజారే

న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నిలబెట్టే అభ్యర్థులకు మద్దతు ఇస్తామని అన్నా హజారే ప్రకటించారు. తాను రాసిన లేఖకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదని, ఆయన పార్టీకి మద్దతు ఇవ్వబోమని హజారే స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై హజారే ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆమె నిరాడంబర జీవితం గడుపుతున్నారని అన్నారు. అందరు ముఖ్యమంత్రుల్లా బంగ్లాలు, కార్లు వాడుకోవడం లేదని... ఒకే గది ఉన్న ఇంట్లో నివాసముంటున్నారని చెప్పారు.

ప్రజల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారని ప్రశంసించారు. దేశానికి, సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని మెచ్చుకున్నారు. మమతా సిద్ధాంతాలను సమర్థిస్తున్నట్టు హజారే చెప్పారు. మమతా బెనర్జీ, హజారే ఫైట్ ఫర్ ఇండియా ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement