హతమారుస్తామంటూ 'అన్నా'కు బెదిరింపు
ముంబయి: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరికలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుంచి దూరంగా జరగకుంటే హత్య చేస్తామంటూ బెదిరింపు లేఖ పంపించారు. 'ఆ లేఖ ఆగస్టు 7వ తేదితో పూర్తిగా ఆంగ్లంలో రాసి ఉంది' అని పోలీసు అధికారులు పీటీఐకు తెలిపారు.
బ్లాక్ మ్యాజిక్కు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు నరేంద్ర దబోల్కర్కు పట్టిన గతే నీకు పడుతుందని హజారేను ఆ లేఖలో హెచ్చరించినట్లు వివరించారు. దీంతోపాటు ఆయన సొంతగ్రామం మహారాష్ట్రలోని రాలేగాం సిద్ధిలో నుంచి కాలు బయటపెట్టొద్దని కూడా బెదిరించారని చెప్పారు. లేఖ ఆధారంగా పోలీసులు 506(నేర పూరిత కుట్ర ఆలోచన) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.