దీదీకి హ్యాండిచ్చిన హజారే | Anna Hazare skips Trinamool Congress rally, Mamata Banerjee addresses crowd | Sakshi
Sakshi News home page

దీదీకి హ్యాండిచ్చిన హజారే

Published Wed, Mar 12 2014 4:32 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM

దీదీకి హ్యాండిచ్చిన హజారే

దీదీకి హ్యాండిచ్చిన హజారే

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సామాజిక కార్యకర్త అన్నా హజారే హ్యాండిచ్చారు.

న్యూఢిల్లీ : తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి  సామాజిక కార్యకర్త అన్నా హజారే హ్యాండిచ్చారు. ఢిల్లీలో బుధవారం తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్వహించిన ర్యాలీకి ఆయన దూరంగా ఉన్నారు.  ర్యాలీలో పాల్గొనవలసిందిగా చివరి నిమిషం వరకు అన్నా హజారేను ఒప్పించేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అయితే ఇందుకు గల కారణం  తృణమూల్‌ ర్యాలీకి జనం తక్కువ రావడం అన్నాకు అసంతృప్తి కలిగించినట్టు సమాచారం.

మరోవైపు అన్నా తీరుపై దీదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగాల్‌లో పనంతా వదిలిపెట్టి వచ్చానని మమత నిష్టూరమాడారు.  ఏ పార్టీని ప్రచారం చేయనని భీష్మించు కూర్చున్న అన్నా హజారే ఈ మధ్య తన పంతం పక్కన పెట్టి తృణమూల్‌ తరపున ప్రచారం చేస్తానని గతంలోనే ప్రకటించారు. ముఖ్యమంత్రి అయినా మమతా బెనర్జీ  అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న వ్యక్తని మమతను అన్నాహజారే ప్రశంసించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement