కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో బీజేపీ, టీఎంసీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మిడ్నాపూర్‌లో తలపెట్టిన ర్యాలీని అడ్డుకున్నారు తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు. బీజేపీ నాయకులు ప్రయాణిస్తున్న బస్సుల మీద దాడి చేసి ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు టీఎంసీ కార్యకర్తలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
అంతేకాక ‘మమతా బెనర్జీ తాలిబన్ దీదీలాగా వ్యవహరిస్తూ.. కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. బీజేపీకి పెరుగుతున్న మద్దతు చూసి ఆమె భయపడుతున్నారు. అందుకే అమిత్ షా ర్యాలీని అడ్డుకోవడమే కాక.. కార్యక్రమానికి హాజరవుతున్న మా కార్యకర్తలపై దాడి చేశారు. బస్సులపై రాళ్లు రువ్వారు. వీటన్నింటిని చూస్తూంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం కావడం లేద’ని వాపోయారు. రాష్ట్రంలో మమతా బెనర్జీ నేతృత్వంలో తాలిబన్ శక్తులు రెచ్చిపోతున్నాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment