
భూ బిల్లుపై దీక్షకు సిద్ధం
విలాస్ టొకాలే లాతూ(మహారాష్ట్ర): సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై దాడి తీవ్రం చేశారు.
విలాస్ టొకాలే లాతూ(మహారాష్ట్ర): సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై దాడి తీవ్రం చేశారు. ప్రధాని మోదీ రైతులకన్నా కార్పొరేట్ల ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని విమర్శించారు. భూసేకరణ బిల్లులోని రైతు వ్యతిరేక అంశాలను తొలగించని పక్షంలో మరో నిరశన దీక్ష చేపట్టేందుకు సిద్ధమని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేలా కేంద్రం బిల్లులో మార్పులు చేయని పక్షంలో 2011లో లోక్‌పాల్ అంశంపై చేసినట్టే నిరశన దీక్ష చేపడతానని చెప్పారు. దేశవ్యాప్తంగా జైల్ భరో ఆందోళన చేపడతామన్నారు. రైతు అనుకూల మార్పులు చేయాల్సిందిగా తాను ఇప్పటికే ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు.