సాక్షి, ముంబై: లోక్‌సభలో బుధవారం లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందటంతో అన్నాహజారే స్వగ్రామమైన రాలేగావ్‌సిద్ధిలో సంబరాలు మిన్నంటాయి. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో పండ్ల రసం సేవించిన అన్నాహజారే తన తొమ్మిది రోజుల దీక్షను విరమించారు. దీంతో రాలేగావ్‌వాసుల ముఖాల్లో ఆనందం దోబూచులాడింది. లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించిందని, దీంతో అన్నా తన దీక్షను విరమించారంటూ టీవీల్లో వార్తలు రావడంతో ఒక్కసారిగా వారంతా కేరింతలు కొట్టారు. జైహింద్... వందే మాతరం, భారత్ మాతా కీ జై అంటూ బిగ్గరగా నినదించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కొందరు జాతీయ గీతాలను ఆలపించగా, మరికొందరు భక్తిగీతాలు పాడారు.
రాలేగావ్‌లో సంబరాలు
Published Thu, Dec 19 2013 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement