ralegan siddhi
-
నిరహార దీక్ష చేపట్టిన అన్నా హజారే
రాలేగావ్ సిద్ధి(మహారాష్ట్ర): సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి దీక్షకు దిగారు. లోక్‌పాల్ బిల్లు, లోకాయుక్త చట్టం నియామకాల్లో కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం ఆయన నిరహార దీక్ష చేపట్టారు. తొలుత ఆయన తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలోని పద్మావతి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత విద్యార్థులు, యువకులు, రైతులతో కలిసి అక్కడికి సమీపంలోని యాదవ్‌బాబా ఆలయానికి వెళ్లిన హజారే అక్కడే దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిని లోకాయుక్త పరిధిలోకి తేవాలని మహారాష్ట్ర క్యాబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అయినప్పటికీ తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు లోక్‌పాల్, లోకాయుక్త, రైతు సమస్యలపై ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. కాగా, తాను దీక్ష ప్రారంభించనున్న విషయాన్ని సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు రాసిన లేఖలో హజారే పేర్కొన్న సంగతి తెలిసిందే. -
కేజ్రీవాల్ కు హజారే ఝలక్
రాలెగావ్ సిద్ధి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే అన్నారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మంత్రులపై చర్యలు తీసుకోకపోతే నిరసనకు దిగుతానని ఆయన హెచ్చరించారు. తన స్వగ్రామం రాలెగావ్ సిద్ధిలో హజరే విలేకరులతో మాట్లాడుతూ... కేజ్రీవాల్ ప్రవర్తనపై తనకు ఎటువంటి అనుమానాలు లేవన్నారు. ఆప్ అధికారంలోకి వచ్చాక కేజ్రీవాల్ ప్రతిష్ట దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చుట్టూవున్న నాయకుల కారణంగా అప్రదిష్టపాలయ్యారని అన్నారు. మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులకు ‘ఆప్’లో స్థానం కల్పించివుంటే కేజ్రీవాల్ కు సమస్యలు వచ్చేవి కాదని అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ మళ్లీ ప్రజల విశ్వాసం పొందాలంటే అధికారం వదులుకుని, దేశ సేవకు మరోసారి ముందుకు రావాలని సూచించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోసం రాజకీయ నాయకులు మహిళలను పావులుగా వాడుకుంటున్నారని వస్తున్న వార్తలు దురదృష్టకరమని హజారే వ్యాఖ్యానించారు. -
వేలానికి అన్నా హజారే కారు
ముంబై: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తన సొంతకారును వేలానికి పెట్టనున్నారు. ఆయన వాడుతున్న మహీంద్రా స్కార్పియో కారును ఆయన సొంతగ్రామం రాలేగావ్‌సిద్ధిలో ఈనెల 17న వేలం వేయనున్నారు. వెన్నునొప్పితో బాధపడుతున్న హజారే కొత్త వాహనం కొనాలని భావిస్తున్నందున్న 8 ఏళ్లుగా వాడుతున్న స్కార్పియోను వేలం వేయాలని నిర్ణయించారని ఆయన అనుచరుడొకరు వెల్లడించారు. ప్రస్తుతం వాడుతున్న కారు తాను నెలకొల్పిన 'స్వామి వివేకానంద కృతజ్ఞత నిధి'తో హజారే కొన్నారు. తనకు పురస్కారాల ద్వారా వచ్చిన నగదుతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర జిల్లా రాలేగావ్‌సిద్ధిలో ఈనెల 17న ఉదయం 11 గంటలకు కారును వేలం వేయనున్నట్టు హజారే అనుచరుడు తెలిపారు. -
రాలేగావ్లో సంబరాలు
సాక్షి, ముంబై: లోక్‌సభలో బుధవారం లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందటంతో అన్నాహజారే స్వగ్రామమైన రాలేగావ్‌సిద్ధిలో సంబరాలు మిన్నంటాయి. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో పండ్ల రసం సేవించిన అన్నాహజారే తన తొమ్మిది రోజుల దీక్షను విరమించారు. దీంతో రాలేగావ్వాసుల ముఖాల్లో ఆనందం దోబూచులాడింది. లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించిందని, దీంతో అన్నా తన దీక్షను విరమించారంటూ టీవీల్లో వార్తలు రావడంతో ఒక్కసారిగా వారంతా కేరింతలు కొట్టారు. జైహింద్... వందే మాతరం, భారత్ మాతా కీ జై అంటూ బిగ్గరగా నినదించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కొందరు జాతీయ గీతాలను ఆలపించగా, మరికొందరు భక్తిగీతాలు పాడారు. -
విషమించిన అన్నా హజారే ఆరోగ్యం!!
అన్నా హజారే ఆరోగ్యం విషమిస్తోంది. లోక్‌పాల్ బిల్లు కోసం పట్టుబడుతూ ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారంతో ఏడో రోజుకు చేరుకుంది. ఆయన బరువు 4.3 కిలోలు తగ్గిపోయారని అన్నా అనుచరుడు సురేష్ పఠారే తెలిపారు. అన్నా హజారే ఈనెల పదో తేదీ నుంచి నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం విషమించిందని జాతీయ వార్తా చానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. లోక్‌పాల్ బిల్లుకు చేసిన సవరణలను అన్నా హజారే స్వాగతిస్తుండగా, ఒకప్పటి ఆయన అనుచరులు అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ లాంటివాళ్లు మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టినది లోక్‌పాల్ కాదు.. జోక్పాల్ అని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. అయితే, బిల్లు నచ్చకపోతే దానిపై నిరాహార దీక్ష చేపట్టాలంటూ ఆయనపై అన్నా హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాను కొందరు తప్పుదోవ పట్టించారని, అసలు ఈ బిల్లు ప్రతులన్నింటినీ అన్నా, ఆయన బృంద సభ్యులు ఎవరైనా చదివారా అని కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. తాను నమ్మిన దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా అన్నా ఆచరిస్తారని, మూడేళ్లుగా ఆయనను చూస్తూనే ఉన్నానని ఆమె చెప్పారు. అన్నా ఆరోగ్యం విషమించడంతో తాను ఢిల్లీ పర్యటనను మానుకుని అన్నాతోనే ఉన్నానని, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందేవరకు, అన్నా దీక్ష విరమించేవరకు ఇక్కడే ఉంటానని తెలిపారు. -
అన్నా- ఆప్ మధ్య భగ్గుమన్న విభేదాలు
అన్నా హజారే బృందానికి.. ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. లోక్‌పాల్ బిల్లు కోసం నాలుగో రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అన్నా హజారేను పలకరించేందుకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గోపాల్ రాయ్‌ని హజారే.. అక్కడినుంచి వెళ్లిపొమ్మన్నారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్‌తో వాగ్వాదం ఫలితంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. వీకే సింగ్ ఆమ్మ ఆద్మీ పార్టీ పేరు గానీ, కేజ్రీవాల్ పేరుగానీ ప్రస్తావించకుండానే విమర్శలు మొదలుపెట్టడంతో ''ఎందుకు అడ్డుకుంటున్నారు? గొడవ చేయాలనుకుంటే, ఇక్కడినుంచి వెళ్లిపోవచ్చు'' అని గోపాల్ రాయ్‌తో హజారే అన్నారు. బహిరంగ సభ వేదికపైనే 'ఆప్' నాయకుడు ఒకరిని హజారే ఇలా అనడంతో ఇద్దరి మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. హజారేతో పాటు వేదిక పంచుకున్న వీకే సింగ్ మాట్లాడుతూ, అవినీతిపై పోరాటానికి మనం వేర్వేరు బృందాలుగా విడిపోకూడదని చెప్పారు. దీనికి రాయ్ అభ్యంతరం వ్యక్తం చేయగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అన్నాహజారే కలగజేసుకుని రాయ్‌ని వెంటనే రాలెగావ్ సిద్ధి వదిలి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. ''దీక్ష చేయాలని మిమ్మల్ని అడగలేదు. గొడవ చేయాలనుకుంటే రాలెగావ్ సిద్ధి వదిలి పోవచ్చు'' అని చెప్పారు. -
కేంద్ర ప్రభుత్వం చీటింగ్ చేస్తోంది: హజారే
జన లోక్ పాల్ బిల్లుకు ప్రార్లమెంట్ లో ఆమోదిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి కేంద్ర ప్రభుత్వం చీటింగ్ పాల్పడుతోంది అని సామాజిక కార్యకర్త అన్నా హాజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేసేలా జన్ లోక్ పాల్ పౌర సమాజ కార్యకర్తలు డ్రాఫ్ చేశారు. జన్ లోక్ పాల్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం నుంచి తన స్వగ్రామం రాలేగావ్ సిద్దిలో నిరవధిక నిరాహార దీక్షను చేపడుతున్నట్టు హజారే ప్రకటించారు. రెండు సంవత్సరాల క్రితం జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదం కొరకు రెండేళ్ల క్రితం అన్నా హజారే ఉద్యమించడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. దీక్ష ఆపండి. లోక్ పాల్ బిల్లును తీసుకువస్తాం అని ప్రభుత్వం సమాచారం అందించింది. జన లోక్ పాల్ బిల్లును తీసుకు రావడానికి యూపీఏ ప్రభుత్వం సిద్దంగా ఉన్నాం అని సోనియా లేఖ తెలిపారు అని హజారే తెలిపారు. సోనియా ఇచ్చిన హామీ వల్లే తాను దీక్ష విరమించానని అయితే ప్రభుత్వం ఇలా చీటింగ్ కు పాల్పడుతుందని అనుకోలేదు అని అన్నారు. నేను నా కుటుంబం కోసం ఉద్యమించడం లేదు. ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేశాను. సామాన్య ప్రజలు జీవించడానికి ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసమే జన లోక్ పాల్ బిల్లును తీసుకురావాలని కోరుతున్నాను అని హజారే అన్నారు. -
10 నుంచి అన్నా నిరవధిక నిరాహార దీక్ష
రాలేగావ్ సిద్ధి వేదికగా లోక్‌పాల్ కోసం పోరు న్యూఢిల్లీ: జన్ లోక్‌పాల్ కోసం మహారాష్ట్రలోని రాలేగావ్‌సిద్ధి వేదికగా మరోసారి ఉద్యమించేం దుకు అన్నా హజారే సమాయత్తమయ్యారు. ఈ నెల 10 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు గురువారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం ఈసారి కూడా జన్ లోక్‌పాల్ బిల్లు తీసుకురాకపోతే పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజు నుంచే దీక్ష చేపడతానని ప్రజలకు మాటిచ్చినట్టు చెప్పారు. అయితే, ఇటీవల తనకు జరిగిన శస్త్రచికిత్స నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. అలాగే తొలుత ప్రకటించిన దీక్షా వేదిక ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌కు బదులు సొంతూరు రాలేగావ్ సిద్ధిలో దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్టు వివరించారు.