10 నుంచి అన్నా నిరవధిక నిరాహార దీక్ష | Anna Hazare to go on indefinite fast from Dec 10 for Janlokpal Bill | Sakshi
Sakshi News home page

10 నుంచి అన్నా నిరవధిక నిరాహార దీక్ష

Published Fri, Dec 6 2013 6:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM

10 నుంచి అన్నా నిరవధిక నిరాహార దీక్ష

10 నుంచి అన్నా నిరవధిక నిరాహార దీక్ష

 రాలేగావ్ సిద్ధి వేదికగా లోక్‌పాల్ కోసం పోరు
 న్యూఢిల్లీ: జన్ లోక్‌పాల్ కోసం మహారాష్ట్రలోని రాలేగావ్‌సిద్ధి వేదికగా మరోసారి ఉద్యమించేం దుకు అన్నా హజారే సమాయత్తమయ్యారు. ఈ నెల 10 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు గురువారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం ఈసారి కూడా జన్ లోక్‌పాల్ బిల్లు తీసుకురాకపోతే పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజు నుంచే దీక్ష చేపడతానని ప్రజలకు మాటిచ్చినట్టు చెప్పారు. అయితే, ఇటీవల తనకు జరిగిన శస్త్రచికిత్స నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. అలాగే తొలుత ప్రకటించిన దీక్షా వేదిక ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌కు బదులు సొంతూరు రాలేగావ్ సిద్ధిలో దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్టు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement