సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి తన ఉద్యమంలో మరోసారి పుట్టడం జరగదని సామాజిక వేత్త అన్నా హజారే స్పష్టం చేశారు. జన్‌లోక్‌పాల్ బిల్లును తీసుకురాలేకపోవడంపై భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాల్లో జరిగిన ర్యాలీ పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీజేపీలకు లోక్‌పాల్‌పై చిత్తశుద్ధి లేదని అన్నారు.
నేను చేసే ఉద్యమాల్లోకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి మళ్లీ రాబోడని అన్నా హజారే స్పష్టం చేశారు. అవినీతిపై అన్నాహజారే 2011 చేపట్టిన ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ కీలకంగా పనిచేసిన విషయం తెలిసిందే. తరువాత.. ఉద్యమం నుంచి బయటకు వచ్చి.. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీపి ఏర్పాటు చేశారు. తరువాత ఎన్నికల్లో విజయం సాధించి ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.
జన్ లోక్‌పాల్ బిల్లును చట్టం చేయడంలో యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని హజారే చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 23న దేశ రాజధాని ఢిల్లీలో రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment