కేంద్ర ప్రభుత్వం చీటింగ్ చేస్తోంది: హజారే
కేంద్ర ప్రభుత్వం చీటింగ్ చేస్తోంది: హజారే
Published Mon, Dec 9 2013 2:42 PM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM
జన లోక్ పాల్ బిల్లుకు ప్రార్లమెంట్ లో ఆమోదిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి కేంద్ర ప్రభుత్వం చీటింగ్ పాల్పడుతోంది అని సామాజిక కార్యకర్త అన్నా హాజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేసేలా జన్ లోక్ పాల్ పౌర సమాజ కార్యకర్తలు డ్రాఫ్ చేశారు. జన్ లోక్ పాల్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం నుంచి తన స్వగ్రామం రాలేగావ్ సిద్దిలో నిరవధిక నిరాహార దీక్షను చేపడుతున్నట్టు హజారే ప్రకటించారు. రెండు సంవత్సరాల క్రితం జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదం కొరకు రెండేళ్ల క్రితం అన్నా హజారే ఉద్యమించడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది.
దీక్ష ఆపండి. లోక్ పాల్ బిల్లును తీసుకువస్తాం అని ప్రభుత్వం సమాచారం అందించింది. జన లోక్ పాల్ బిల్లును తీసుకు రావడానికి యూపీఏ ప్రభుత్వం సిద్దంగా ఉన్నాం అని సోనియా లేఖ తెలిపారు అని హజారే తెలిపారు. సోనియా ఇచ్చిన హామీ వల్లే తాను దీక్ష విరమించానని అయితే ప్రభుత్వం ఇలా చీటింగ్ కు పాల్పడుతుందని అనుకోలేదు అని అన్నారు. నేను నా కుటుంబం కోసం ఉద్యమించడం లేదు. ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేశాను. సామాన్య ప్రజలు జీవించడానికి ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసమే జన లోక్ పాల్ బిల్లును తీసుకురావాలని కోరుతున్నాను అని హజారే అన్నారు.
Advertisement