వేలానికి అన్నా హజారే కారు | Hazare's SUV to be auctioned at Ralegan Siddhi on May 17 | Sakshi
Sakshi News home page

వేలానికి అన్నా హజారే కారు

Published Thu, May 14 2015 5:10 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

వేలానికి అన్నా హజారే కారు - Sakshi

వేలానికి అన్నా హజారే కారు

ముంబై: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తన సొంతకారును వేలానికి పెట్టనున్నారు. ఆయన వాడుతున్న మహీంద్రా స్కార్పియో కారును ఆయన సొంతగ్రామం రాలేగావ్‌సిద్ధిలో ఈనెల 17న వేలం వేయనున్నారు. వెన్నునొప్పితో బాధపడుతున్న హజారే కొత్త వాహనం కొనాలని భావిస్తున్నందున్న 8 ఏళ్లుగా వాడుతున్న స్కార్పియోను వేలం వేయాలని నిర్ణయించారని ఆయన అనుచరుడొకరు వెల్లడించారు.

ప్రస్తుతం వాడుతున్న కారు తాను నెలకొల్పిన 'స్వామి వివేకానంద కృతజ్ఞత నిధి'తో హజారే కొన్నారు. తనకు పురస్కారాల ద్వారా వచ్చిన నగదుతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర జిల్లా రాలేగావ్‌సిద్ధిలో ఈనెల 17న ఉదయం 11 గంటలకు కారును వేలం వేయనున్నట్టు హజారే అనుచరుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement