అన్నాజీ.. థాంక్యూ!
న్యూఢిల్లీ: ఢిల్లీ జన్‌లోక్‌పాల్ బిల్లుకు మద్దతునిచ్చిన ప్రముఖ సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక పోరాటయోధుడు అన్నా హజారేకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌పాల్ బిల్లు విషయమై హజారే ప్రతిపాదించిన సూచనలను తప్పకుండా అమలుచేస్తామని చెప్పారు. 'ఆశీస్సులు, మద్దతు అందజేసినందుకు అన్నాజీకి కృతజ్ఞతలు. మీ సూచనలను మేం తప్పకుండా అమలుచేస్తాం' అని కేజ్రీవాల్ మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కేజ్రీవాల్ సర్కార్ సోమవారం జన్‌లోక్‌పాల్ బిల్లును ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును అన్నా హజారే స్వాగతించారు. ఈ బిల్లులో భాగంగా నలుగురు సభ్యులు -ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, స్పీకర్, ఒక స్వతంత్ర సభ్యుడితో స్వతంత్ర కమిటీని ఏర్పాటుచేయాలని ప్రతిపాదించగా.. ఈ కమిటీలో ఏడుగురు సభ్యులు ఉండాలని, అందులో
స్వతంత్ర సభ్యుడిగా సామాజికవేత్తను నియమించాలని హజారే సూచించారు.