
'అన్నాను చంపే సమయమొచ్చింది'
ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారేకు ఫేస్‌బుక్ ద్వారా బెదిరింపు సందేశాలు వచ్చాయి.
థానే: ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారేకు ఫేస్‌బుక్ ద్వారా బెదిరింపు సందేశాలు వచ్చాయి. ‘అన్నా హజారేను చంపే సమయం వచ్చింది. నేనే కాబోయే నాథూరామ్ గాడ్సే’ అని కెనడా ఎన్నారై గగన్ విధు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దీనిపై హజారే ఆఫీసు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
దీంతో పోలీసులు గగన్‌తో పాటు అతనికి సహకరించిన నీల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అలాగే, హజారే భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, ఫేస్‌బుక్ సందేశం వచ్చిన కంప్యూటర్ ఐపీ అడ్రస్ కనుగొనడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అన్నా మద్దతుదారుడు అశోక్ గౌతమ్‌కు కూడా బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.