
మిగిలిన భూమి రియల్ ఎస్టేట్ కోసమా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.
ఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. సారవంతమైన భూములను ఏకపక్షంగా లాక్కొని రైతులకు అన్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. మంగళవారం ప్రముఖ సామాజిక వేత్త అన్నా హజారేను అంబటి, ఏపీ రాజధాని ప్రాంత రైతు నేతలు కలిశారు. అన్నా హజారే దీక్ష వద్ద రాజధాని కౌలు పంటల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు అంబటి తెలిపారు.
మార్చి మొదటి వారంలో ప్రముఖ సంఘ సంస్కర్త మేధా పాట్కర్ కూడా ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ రాజధానికి రెండు వేల ఎకరాలు సరిపోయే పక్షంలో, మిగిలిన భూమిని రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించనున్నారా?అని అంబటి ప్రశ్నించారు.