సామాజిక కార్యకర్త అన్నా హజారే ఢిల్లీలో మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. రాలేగావ్‌సిద్దిలో మీడియాతో మాట్లాడిన అన్నా..
సాక్షి, ముంబై: సామాజిక కార్యకర్త అన్నా హజారే ఢిల్లీలో మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. రాలేగావ్‌సిద్దిలో మీడియాతో మాట్లాడిన అన్నా.. ఈ నెల 24న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతర్-మంతర్ మైదానంలో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. రైతుల కష్టాలతోపాటు వివిధ సమస్యలపై పలుమార్లు మోదీకి లేఖలు రాసినా ఇంతవరకు జవాబు రాలేదని ఆరోపించారు.