'బీజేపీని వీడితే మోడీకి అన్నా హజారే మద్దతు'
'బీజేపీని వీడితే మోడీకి అన్నా హజారే మద్దతు'
Published Thu, Aug 29 2013 1:41 PM | Last Updated on Thu, Apr 4 2019 3:19 PM
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని వీడితే తాను మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని అవినీతి వ్యతిరేక పోరాటయోధుడు అన్నాహజారే అన్నట్టు అమెరికా మీడియా ఓ కథనాన్ని వెల్లడించింది.
రెండు వారాల అమెరికా పర్యటనలో భారత సంతతికి చెందిన కమ్యూనిటీలు, విద్యావేత్తలు, మేధావులతో డెలావర్ లోని ఓ హిందూ ఆలయంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు హఫింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది.
తనకు రాజకీయ పార్టీల మీద విశ్వాసం లేదని, బీజేపీకి చెందిన నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వలేనని హజారే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ మోడీ బీజేపీని వీడితే తప్ప తాను మద్దతు ఇవ్వలేనని స్పష్టం చేసినట్టు సమాచారం.
Advertisement
Advertisement