నాగ్ పూర్: గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అమెరికా వీసా ఇవ్వలేమని ఆమెరికా స్పష్టం చేసింది. మోడీ వీసా మంజూరుపై గతంలో తీసుకున్న తమ వైఖరిలోఎటువంటి మార్పులేదని అమెరికా కాన్సుల్ జనరల్ పీటర్ హౌస్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. మోడీకి వీసా జారీ విధానాన్ని మార్చుకోలేదని ఆయన తెలిపారు. అమెరికా-భారత వర్తక సంబంధాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. అమెరికా వీసాల కోసం గతేడాది 8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 7 లక్షల మందికి మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. వీరిలో విద్యార్థులు ఎక్కువ శాతం మంది ఉన్నారన్నారు.
గుజరాత్ సీఎం నరేంద్రమోడీ హయంలోనే గోద్రాలో అల్లర్లు నేపధ్యాన్ని పురస్కరించుకుని మోడీకి వీసా జారీ చేసేందుకు గతంలో యూఎస్ నిరాకరించిన సంగతి తెలిసిందే.