హజారే కారుకు తొమ్మిది లక్షలు వచ్చాయి | Anna Hazare's SUV auctioned for Rs 9.11 lakh | Sakshi
Sakshi News home page

హజారే కారుకు తొమ్మిది లక్షలు వచ్చాయి

Published Sun, May 17 2015 10:26 PM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM

హజారే కారుకు తొమ్మిది లక్షలు వచ్చాయి

హజారే కారుకు తొమ్మిది లక్షలు వచ్చాయి

రాలేగావ్ సిద్ధిఖీ: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఉపయోగించిన మహింద్రా స్కార్పియో వాహనాన్ని ఆయన కీలక అనుచరుడు వేలంలో రూ. తొమ్మిదిలక్షలకు పైగా చెల్లించి సొంతం చేసుకున్నారు. హజారే నిర్వహించిన ఎన్నో అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో, లోక్పాల్ బిల్లు సమయంలో గత ఎనిమిదేళ్లుగా ఆయన ఆ వాహనాన్ని ఉపయోగించారు. ఆదివారం హజారే సొంతగ్రామం రాలేగాం సిద్ధిఖీలో వేలం పాట నిర్వహించారు. దీనిని అహ్మద్ నగర్ కు చెందిన అతుల్ లోఖండే మొత్తం రూ.9,11,000 చెల్లించి సొంతం చేసుకున్నారు. హజారేకు ఇప్పుడు కొత్త వాహనం కావాలని, ఆయన గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారని, వాహనాన్ని మార్చాల్సిన అవసరం ఉండి వేలం పెట్టామని ఆయన మరో అనుచరుడు దత్త అవారీ చెప్పారు. ఆ వాహనానికి ఘనమైన చరిత్రే ఉందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement