నిరశన దీక్షను విరమించుకున్న అన్నా | Anna Hazare suspends October 2 hunger strike in New Delhi | Sakshi
Sakshi News home page

నిరశన దీక్షను విరమించుకున్న అన్నా

Published Sat, Sep 12 2015 4:12 PM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

నిరశన దీక్షను విరమించుకున్న అన్నా - Sakshi

నిరశన దీక్షను విరమించుకున్న అన్నా

ముంబై: మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2న తలపెట్టిన నిరశన దీక్షను ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే విరమించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం భూసేకరణ బిల్లుపై వెనక్కి తగ్గడం, మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) విధానాన్ని అమలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అన్నా హజారే తెలిపారు.

భూసేకరణ బిల్లు ఉపసంహరణ, ఓఆర్ఓపీ విధానం అమలు డిమాండ్లతో అక్టోబరు 2న ఢిల్లీ రామ్లీలా మైదానంలో నిరశన దీక్ష చేపట్టాలని అన్నా హజారే గతంలో నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఈ రెండు డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవడం అన్నా దీక్షను విరమించుకున్నారు. అన్నా తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధీలో ఈ విషయం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement