భయంతోనే భూములు ఇచ్చాం | Capital region farmers to say anna hazare group only by afraid of given lands | Sakshi
Sakshi News home page

భయంతోనే భూములు ఇచ్చాం

Published Thu, Mar 12 2015 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

భయంతోనే భూములు ఇచ్చాం

భయంతోనే భూములు ఇచ్చాం

తుళ్ళూరు రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి భయపడి భూములు ఇచ్చామని, రాజధాని ప్రాంత రైతులు జాతీయ ఐక్య కూటమి కన్వీనర్ పి.వి.రాజగోపాల్ ఎదుట వాపోయారు.

అన్నా హజారే మిత్ర బృందంతో రాజధాని రైతుల ఆవేదన
తాడికొండ (గుంటూరు):తుళ్ళూరు రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి భయపడి భూములు ఇచ్చామని, రాజధాని ప్రాంత రైతులు జాతీయ ఐక్య కూటమి కన్వీనర్ పి.వి.రాజగోపాల్ ఎదుట వాపోయారు. రాజధాని ప్రాంతంలో రైతుల్లో నుంచి భూములు బలవంతంగా లాక్కొంటున్నారని తెలుసుకున్న అన్నహజారే మిత్ర బృందం అయిన రాజగోపాల్ బృందం రాజధాని గ్రామంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. తుళ్ళూరు మండలంలోని మందడం,తాళయపాలెం, ఉద్దడ్రాయనిపాలెం, లింగాయపాలెం, రాయపూడి గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలు, మనోభావాలు తెలుసుకుని రైతుల తరుపున పోరాడతామని రైతులకు భరోసా ఇచ్చారు. ఈసందర్భంగా లింగాయపాలెం గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ రైతులు బలవంతంగా భూములు ఇచ్చినట్లయితే వెనక్కు తీసుకోవచ్చని, ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకునేటటై్లతే తాము రైతుల తరుపున నిలబడి పోరాడతామని చెప్పారు.

రాజధాని ప్రాంత సమస్యలను ఢిల్లీలో అన్నహజారే దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో మూడు పంటలు పండే భూములను రాజధాని నిర్మాణానికి తీసుకోవడం సరైంది కాదన్నారు. ఈ సందర్భంగా రాజధాని పర్యటన కమిటి నాయకులు లింగాయపాలెం గ్రామానికి చెందిన అనుమోలు గాంధీ మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన రాజధాని ప్రాంత రైతుల తరుపున ఢిల్లీలో నిర్వహించిన సేవా గ్రామ్ కార్యక్రమానికి వెళ్ళి రాజధాని ప్రాంత పరిస్థితిపై అన్నహాజరేకు వివరించినట్లు చెప్పారు. కొద్దిరోజుల్లో రాజధాని ప్రాంతంలో పర్యటించే అవకాశం ఉందన్నారు. ఈనెలాఖరు నుంచి అన్నహజారే 1100 కిలో మీటర్ల పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా రాజధాని ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా కొద్దిరోజుల్లో రాజధానిప్రాంతాన్ని సందర్శించడానికి మేధాపాట్కార్ కూడా రానున్నట్లు చెప్పారు. అనంతరం రాయపూడిలోని నిమ్మతోటలను పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీఎంటీమ్ ప్రతినిధి బలిశెట్టి సత్యనారాయణ, విష్ణు, ప్రముఖ న్యాయవాది మల్లెల శేషగిరిరావు, చిట్టిబాబు, పలువురు నాయకులు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement