ఖజురహో: లోక్‌పాల్ బిల్లు, రైతులు, వ్యవసాయ సమస్యలపై ఇప్పటివరకు 32 లేఖలు రాసినా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించలేదని సామాజిక కార్యకర్త అన్నా హజారే విమర్శించారు. దీంతో ‘మీరు తీవ్రమైన పనిఒత్తిడితో నాకు జవాబు ఇవ్వలేకపోయి ఉండొచ్చు లేకుంటే మీ అహంకారం అందుకు కారణమై ఉండొచ్చు’అని లేఖ రాసినట్లు వెల్లడించారు. రెండ్రోజుల జాతీయ జల కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు శనివారం నాడిక్కడికి వచ్చిన హాజరే ఈ మేరకు స్పందించారు. మోదీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రానందున వచ్చే మార్చి 23 నుంచి నిరవధిక ఆందోళనలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. లోక్‌పాల్ చట్టం ఏర్పాటు చేసి, రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేసిన తర్వాతే ఆందోళనల్ని విరమిస్తానన్నారు. తన ఆందోళన పూర్తి అహింసాయుత మార్గంలో సాగుతుందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఏమాత్రం తేడా లేదని హజారే విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment