మరో పోరాటానికి హజారే సిద్ధం | Anna Hazare to start another agitation for Lokpal | Sakshi
Sakshi News home page

మరో పోరాటానికి హజారే సిద్ధం

Published Wed, Mar 29 2017 8:16 PM | Last Updated on Tue, Jun 4 2019 6:33 PM

మరో పోరాటానికి హజారే సిద్ధం - Sakshi

మరో పోరాటానికి హజారే సిద్ధం

పుణె: అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నాహజారే మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. లోక్ పాల్ నియామకంపై కేంద్రం చూపుతున్న ఉదాసీనత వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగనున్నట్టు హజారే బుధవారం ప్రకటించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు లోక్ పాల్ నియామకం జరగకపోవడం పట్ల ఆయన ఆందోళన చేశారు.

లోక్ పాల్ నియామకంపై జాప్యానికి కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు తెలిపారు. దీనికి కేంద్రం నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో చూస్తానని చెప్పారు. తాను ఎప్పటి నుంచి ఆందోళన చేపట్టబోయేది తర్వాత వెల్లడిస్తానని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ లోకాయుక్త నియామకాలు చేపట్టకపోవడాన్ని హజారే తప్పుబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement