పుణే: ప్రభుత్వం తనకు కల్పించిన భద్రతకు ఉపసంహరించుకోవాలని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. తనకు భద్రత కల్పించడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. తనకు గతంలో బెదిరింపులు వచ్చినా లెక్కచేయలేదన్నారు. ఇటీవల చాలామందికి భద్రతను తగ్గించడం లేదా తొలగించిన ప్రభుత్వం తను కోరినా స్పందించలేదన్నారు. అందుకే మరోసారి లేఖ రాశానని హజారే పేర్కొన్నారు.
కాగా, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఉన్న ఎక్స్ కేటగిరీ భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కుదించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు మాత్రం సెక్యురిటీ పెంచడం గమనార్హం. వై ప్లస్ సెక్యూరిటీ నుంచి జెడ్ ప్లస్‌కు పెంచారు. 29 మంది నాయకుల భద్రతా కేటగిరీలో మార్పులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment