
త్వరలో అన్నా మరో ఉద్యమం
పుణె: ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు. మహారాష్ట్రలో సంపూర్ణ మద్యనిషేధం కోసం ఉద్యమించనున్నట్టు హజారే ప్రకటించారు. మద్యపానం వల్ల కుటుంబాలు చెడిపోతున్నాయని, మహిళలు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో హజారే మాట్లాడుతూ.. మద్య నిషేధం కోసం పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పారు. ఇందుకోసం ముసాయిదాను దాదాపుగా సిద్ధంచేశామని, దీన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు సమర్పిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కూడా మద్యపాన నిషేధ చట్టానికి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ముసాయిదాను పటిష్టంగా రూపొందించేందుకు సాయం చేయాల్సిందిగా వేదికపై ఉన్న కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి మాధవ్ గాడ్‌బొలేను హజారే కోరారు.