సాక్షి, యాదాద్రి : తడక కల్పన.. ఎంఏ సోషియాలజీ, పీహెచ్‌డీ చదివింది. సౌత్ ఏసియా నెట్‌వర్క్ ఫెమినిజంపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కోర్సును పూర్తి చేశారు. మహిళలు, ఆడపిల్లలు, చేనేత కార్మికుల హక్కులపై పోరాడుతుంది. బంగ్లాదేశ్, మయన్మార్, సౌత్ ఆఫ్రికా దేశాల్లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ సెమినా ర్లలో మహిళల సమస్యలపై ప్రసంగించారు. ‘సాక్షి’ చేపట్టిన మహిళా క్యాంపెయిన్ ‘నేను శక్తి’కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ఆడపిల్ల ఈ దేశంలో పుట్టడానికే నోచుకోలేని దయనీయ స్థితిలో ఉంది. తల్లి కడుపులో ఆడపిల్ల పడగానే నిలువునా చంపేస్తున్నారు.
ఆడపిల్ల పుడుతుందని తెలియగానే తోటి మహిళ(అత్త, ఆడబిడ్డ) ఇలా కోడలిని వేధిస్తున్నారు. ఇలాంటి సమయంలో మహిళా బతకడ మే కష్టమైంది. ఇక సాధికారిత ఎలా సాధ్యమవుతుంది. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారని నాలుగో గర్భంలో ఉన్న ఆడపిల్లకు జన్మనివ్వద్దని అబార్షన్ చే యిస్తే ఆ మహిళ చనిపోయింది. అబార్షన్ చేసిన ఆర్‌ఎంపీ డాక్టర్, కుటుంబ సభ్యులను సమాజం కాపాడింది. ఆడ పిల్లలను కేవలం విలాస వస్తువుగా, ఆస్తిగా మాత్రమే చూస్తున్నారు. వస్తువును తనకు నచ్చిన విధంగా వాడుకునే ఆలోచన తప్ప ఆమెకు కొన్ని భావాలు ఉంటాయి. వాటిని గౌరవించాలన్న వ్యక్తిత్వం లేదు. ఆడపిల్లను కంటే తల్లిదండ్రులు నష్టంగా కొడుకును కంటే లాభంగా మాత్రమే ఆలోచిస్తున్నారు. అందుకే ఇంకా ఈరోజుకు వరకట్న చావులు, నవవధువుల మృత్యుఘంటికలు మోగుతున్నాయి.
కొన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉండాలి
మహిళలకు తమ గర్భంలో ఉన్న శిశువు ఆడైన, మగైన కనే అధికారం ఉం డాలి. ఎలాంటి దుస్తులు ధరించాలి. ఏం తినాలి, ఏం చదవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, అనే విషయంలో స్వేచ్ఛ ఉండాలి. మారుతున్న పరిస్థితుల్లో సమాజంలో జరుగుతున్న తప్పులకు మహిళలను బాధ్యులుగా చేయ డం మారాలి. అమ్మాయిలకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ఇస్తూ వారి ని నిందించే విధానం మానుకోవాలి.
సమాన అవకాశాలతోనే సాధికారత
మహిళలు సాధికారితతో అన్నిరంగాల్లో రాణించాలంటే వారికి అవకాశాలు ఇవ్వాలి. ప్రకృతి ఇచ్చిన శరీరాకృతిని అడ్డం పెట్టుకుని వారి ఆశయాలను, స్ఫూర్తిని దెబ్బతీసే సమాజం మారాలి. మహిళలు అన్నింటిలో రాణిస్తున్నారు. అయినా వివక్ష, వేధింపులు, నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల శక్తి, సామర్థ్యాలను చూడలేని వారు వారి పట్ల చిన్న చూపుతో సూటిపోటి మాటలతో నిరుత్సాహ పరుస్తున్నారు. నిర్ణయాధికారాల్లో సమా న భాగస్వామ్యం అన్ని రంగాల్లో సమాన అవకాశాల కోసం మాత్రమే మహిళలు పోటీపడుతున్నారు. ఆడ పిల్లలు 5వ తరగతి తర్వాత చదువులో ముం దుకుపోలేకపోతున్నారు.అవకాశాలు కల్పించి గౌరవం ఇస్తే రిజర్వేషన్‌లు లేకుండానే మహిళా సాధికారిత సాధ్యమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment