మహిళల హక్కుల రక్షణకే వృత్తి చేపట్టా.. | This career has been selected for the protection of women rights | Sakshi
Sakshi News home page

మహిళల హక్కుల రక్షణకే వృత్తి చేపట్టా..

Published Tue, Feb 20 2018 5:45 PM | Last Updated on Tue, Feb 20 2018 5:45 PM

This career has been selected for the protection of women rights - Sakshi

న్యాయవాది జి.మనీషా

నల్లగొండ లీగల్‌ : ‘మహిళా హక్కుల రక్షణకు ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చాయి. వాటిని మహిళలకు తెలియజేసి, వారి హక్కులను కాపాడాలనే ఉద్దేశంతోనే న్యాయవాద వృత్తిని చేపట్టా’ అని చెబుతోంది.. నల్లగొండకు చెందిన న్యాయవాది జి.మనీషా. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె ‘సాక్షి’ వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. 

నేను బీ.ఫార్మసీ పూర్తి చేసిన అనంతరం న్యాయవాది కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. కార ణం మా నాన్న మాల కొండారెడ్డి కూడా న్యాయవాది కావడంతోనే ఈ వృత్తిపై ఆసక్తి పెరిగింది. 2011లో నెట్టెంపాడు ప్రాజెక్టులో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పనిచేస్తున్న (ప్రస్తుత నల్లగొండ జాÆ ‡ుుంట్‌ కలెక్టర్‌) సి.నారాయణరెడ్డితో వివాహం జరిగింది. నా భర్త ప్రోత్సాహంతో 2016లో లా డిగ్రీ పూర్తి చేశా. ప్రస్తుతం నల్లగొండ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నా. సత్వర న్యాయం సమన్యాయమే ధ్యేయంగా భారత న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. మహిళను ప్రోత్సహిస్తే ఎంతో ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవకాశం ఉంది. ప్రజలకు చట్టాలపై అవగాహ న తీసుకురావడానికి న్యాయవిజ్ఞాన శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. భూ వివాదాలు పరిష్కారం కావడానికి కోర్టుల్లో ఎక్కువ సమయం పడుతుంది. పెరుగుతున్న కేసుల రద్దీకి అనుగుణంగా కోర్టుల సంఖ్యను పెంచాలి. కక్షిదారులకు సమ్మతి మేర కు లోక్‌ అదాలత్‌ల ద్వారా కేసులను పరిష్కరించడం జరుగుతుంది. ఇటీవల పెద్ద సంఖ్యలో మహిళలు న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు న్యాయమందించడం సంతోషకరం.  

మహిళలు చట్టాలపై అవగాహన కలిగించాలి
మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి. ప్రభుత్వాలు మహిళల రక్షణకు అనేక చట్టాలు రావడం జరిగింది. తమ హక్కులకు భంగం కలిగినప్పుడు ఈ చట్టాల ద్వారా న్యాయస్థానాలను ఆశ్రయించి సత్వర న్యాయం పొందవచ్చు. 
– దువ్య గీత, న్యాయవాది, నల్లగొండ

లాయర్‌ కావాలనే..  
పేదలు, మహిళలు, బాలల హక్కులను కాపాడానికే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చినా, వదులుకుని న్యాయ విద్యనభ్యసించి న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నా. పట్టుదలతో చదివి న్యాయవాదిని అయ్యా. మహిళలకు న్యాయ సాయం అందించడంతో పాటు వారి హక్కులను తెలియపరుస్తున్నా.
– మామిడి ప్రమీల, న్యాయవాది, నల్లగొండ


బాల్యంలోనే అన్యాయంపై ప్రశ్నించేదాన్ని..
కోదాడఅర్బన్‌ : ఏ విషయంలో అన్యాయం జరిగిందని అనిపిస్తే దానిపై చిన్నతనంలోనే ప్రశ్నించేదానిని. బీఎస్సీ చదివిన నేను స్వతహాగానే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించాలనుకున్నా. 1988–91 మధ్య కాలంలో గుంటూరులోరి ఆంధ్రా క్రిస్టియన్‌(ఏసీ) కాలేజీలో బీఎల్‌ కోర్సు పూర్తి చేశా. అనంతరం ఆరునెలలు హైదరాబాద్‌లో పనిచేశా. 1992 నుంచి నేటివరకు కోదాడ కోర్టులోనే ప్రాక్టీస్‌ చేస్తున్నా. మా కుటుంబంలో అందరూ విద్యావంతులే కావడంతో నేను న్యాయవాది వృత్తిలోకి ప్రవేశించడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ప్రస్తుత తరం అమ్మాయిలు ధైర్యంగా ఉండి, క్లిష్ట పరిస్థితులను ఎదిరించే విధంగా తయారుకావాలి. న్యాయవాద వృత్తిలో ప్రవేశిస్తే సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించవచ్చు. బాధితులకు అండగా నిలబడే అవకాశం ఉంటుంది.
– శ్రీదేవి, న్యాయవాది, కోదాడ 

పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి
వివిధ కోర్టుల్లో పెండింగ్‌ కేసులను పరిష్కరించి సత్వర న్యాయం అందించేందుకు న్యాయ వ్యవస్థ కృషి చేయాలి. మహిళల హక్కుల రక్షణకు అనేక చట్టాలున్నా వాటి అమలులో లోపాల వల్ల నేటికి మహిళలు సకాలంలో న్యాయం పొందడం లేదు. చట్టాలను అమలు పర్చాల్సిన సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మూలంగా మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
– ఎన్‌.సంధ్యారాణి, న్యాయవాది, నల్లగొండ 

న్యాయవ్యవస్థలో మహిళల పాత్ర పెరగాలి
చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో న్యాయసేవాధికార సంస్థతో పాటు ప్రభుత్వ కృషి ఉండాలి. న్యాయవాదిగా పనిచేస్తూ మహిళల తరఫున నిలబడాలనే తపనతోనే ఈ వృత్తిని ఎంచుకున్నా. న్యాయవ్యవస్థలో మహిళల పాత్ర మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది.  
– ఎం.ప్రగతి, న్యాయవాది, నల్లగొండ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement