త్వరలో ఏపీ స్టడీ సర్కిల్ ప్రారంభం
Published Sat, Jul 30 2016 12:36 AM | Last Updated on Mon, Oct 22 2018 8:20 PM
ఎంవీపీ కాలనీ: ఏపీ స్టడీ సర్కిల్ త్వరలో విశాఖలో ప్రారంభంకానుందని సోషల్ వెల్ఫేర్ ఉపసంచాలకుడు డి.వి.రమణమూర్తి తెలిపారు. ఎంవీపీకాలనీలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ దీనికోసం ప్రభుత్వం రుషికొండలో చేపట్టిన భవనాల నిర్మాణం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సిద్ధం చేస్తామన్నారు. అప్పటి వరకు నాన్ రెసిడెనసియల్ (వసతి సౌకర్యం లేకుండా) తరగతుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ పద్ధతిలో ఇప్పటికే మొదటి బ్యాచ్ పూర్తయ్యిందని, త్వరలో రెండో బ్యాచ్ ప్రారంభమవుతుందని చెప్పారు. కాగా, జేఎన్‌టీయూ నిర్వహించే విద్యోన్నతి పథకానికి ఈ నెల 31తో గడువు ముగుస్తుందని వెల్లడించారు.
Advertisement
Advertisement