యువత చేతిలో సమాజాభివృద్ధి
Published Mon, Jan 13 2014 2:23 AM | Last Updated on Mon, Oct 22 2018 8:20 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సమాజాభివృద్ధిలో యువత కీలక పాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని నెహ్రూ యువకేంద్రం, సెట్‌శ్రీ, వివేకానంద సేవా సమితి, యంగ్ ఇండియా సంయుక్తంగా అంబేద్కర్ అడిటోరియంలో ఆదివారం నిర్వహిం చాయి. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ యువత మేల్కొని సమాజాభివృద్ధిలో పాలుపంచుకుంటే దేశ స్థితిగతులు మారుతాయన్నారు. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్- వీక్‌నెస్ ఈజ్ డెత్ అని పేర్కొంటూ భారతదేశం సూపర్ పవర్‌గా ఎదుగుతుందని అనేక సర్వేలు, అనుభవజ్ఞులు సూచిస్తున్నారన్నారు. ఆ స్థానం పొంద డానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో కనీసం 10 లక్షల మంది యువత ఉందని, వారందరూ సమా జాన్ని నడిపించే సారథులు కావాలన్నారు. వ్యక్తిగత మరుగు దొడ్లను నిర్మించడంలో, బడిమానేసిన వారిని తిరిగి బడిబాట పట్టేలా చేయడం, క్రీడా మైదానాలు అభివృద్ధి చేయడం, సాక్షర భారత్ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు యువత కృషి చేయాలన్నారు. ప్రతీ ఇంటి నుంచి చెత్త సేకరణ కోసం 20 రూపాయలు వసూలు చేయనున్నట్టు పేర్కొన్నారు. పొందూరు మండలంలో ఎంఎస్‌సీ చదివిన యువకులు చెత్త సేకరణకు ముందుకు వచ్చారంటూ.. వారిని అభినందించారు. గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకుగాను రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలను ఉపాధి హామీ పథకం ద్వారా ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. అంతకు ముందు సూర్యమహాల్ కూడలి వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
పలువురి రక్తదానం
వివేకానందుడి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పలు వురు రక్తదానం చేశారు. కె.ఆర్.స్టేడియంలో రిమ్స్ ఆధ్వర్యంలో రక్తదాన సేకరణ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌తో సహా పలువురు రక్తదానం చేశారు. కార్యక్ర మంలో ఎన్‌వైకే జిల్లా సమన్వయకర్త కె.వి.రమణ, సెట్‌శ్రీ సీఈఓ వి.వి.ఆర్.ఎస్.మూర్తి, కేంద్ర సహాయమంత్రి కె.కృపా రాణి ఓఎస్‌డీ సురంగి మోహనరావు, హైదరాబాద్ రామకృష్ణ మఠానికి చెందిన కె.ఎల్.మూర్తి, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్‌మో హన్‌రావు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారా యణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement