ఫొటోలు తీశాడని హెడ్‌ కానిస్టేబుల్‌పై దాడి | Youth Attack On Head Constable Srikakulam | Sakshi
Sakshi News home page

ఫొటోలు తీశాడని హెడ్‌ కానిస్టేబుల్‌పై దాడి

Mar 18 2022 9:15 AM | Updated on Mar 18 2022 10:54 AM

Youth Attack On Head Constable Srikakulam - Sakshi

సాక్షి,కాశీబుగ్గ(శ్రీకాకుళం): ట్రాఫిక్‌కు అంతరాయంగా ఉన్న ద్విచక్ర వాహనాలు తొలగించాలని చెప్పిన హెడ్‌ కానిస్టేబుల్‌పై ఇద్దరు యువకులు దాడి చేసిన సంఘటన పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కాశీబుగ్గ సీఐ సాకేటి శంకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీబుగ్గ పాత జాతీయ రహదారిలోని ఓ టిఫిన్‌ సెంటర్‌ వద్ద ఎస్సీ వీధికి చెందిన బోస్‌ రాంబాబు, బోస్‌ కుమార్‌లు పూటుగా మద్యం తాగి ద్విచక్ర వాహనాలతో ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగించగా.. అటుగా వెళ్తున్న కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ బి.శ్రీనివాసరావు వారిని నియంత్రించే ప్రయత్నం చేశారు.

అక్కడి పరిస్థితిని అధికారులకు తెలియజేసేందుకు ఫొటోలు తీస్తుండగా యువకులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న మిగిలిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని నియంత్రించారు. గురువారం ఇద్దరినీ అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement