సాక్షి, న్యూఢిల్లీ: మీ పిల్లలు తగినన్ని నీళ్లు తాగుతున్నారా? చాలామంది తల్లిదండ్రులకిది అనుభమవే. నీళ్లు తాగమంటూ పిల్లలకు పదేపదే చెప్పటం, అయినా వారు వినకపోవటం కొత్తేమీ కాదు. స్కూలుకు వాటర్ బాటిల్ తీసుకెళ్లినవారు మూత కూడా తీయకుండా ఇంటికి తిరిగి తెచ్చేయటం తెలియని విషయమూ కాదు. ఈ సంగతి గ్రహించే కేరళ స్కూళ్లు ఓ చిట్కా కనిపెట్టాయి. ఆ చిట్కా పేరే... ‘గంట’కు గుక్కెడు నీళ్లు. విద్యార్థులకు ‘వాటర్ బెల్’ విరామమన్న మాట. స్కూల్ సమయంలో ప్రత్యేకంగా గంట కొట్టి విద్యార్థులతో నీటిని తాగించటమే ఈ చిట్కా. రోజులో మూడుసార్లు విద్యార్థులు నీళ్లు తాగేందుకే ప్రత్యేకంగా ‘వాటర్ బెల్’ మోగిస్తున్నారు. కేరళలో ప్రారంభమైన ఈ విధానం ప్రస్తుతం కర్ణాటకకూ పాకింది. గంట కొట్టి మరీ నీటిని తాగించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీన్ని అన్ని స్కూళ్లలో తప్పనిసరిగా అమలు చేయాలనేది తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండు కూడా!!.
Comments
Please login to add a commentAdd a comment