న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ దిగ్గజం, భెల్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.40,932 కోట్ల ఆర్డర్లు సాధించింది. అంతకు ముందటి ఆర్డర్లతో పోల్చితే ఇది 74 శాతం అధికమని భెల్ సీఎమ్‌డీ అతుల్ సోబ్తి తెలిపారు. దీంతో గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి తమ ఆర్డర్ల బుక్ విలువ రూ.1,18,000 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
కంపెనీ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్) సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల లాభం 152 శాతం పెరిగిందని సోబ్తి తెలిపారు. ఇక నికర లాభం రూ.496 కోట్ల నుంచి 63 శాతం వృద్ధితో రూ.807 కోట్లకు పెరిగిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 91 శాతం డివిడెండ్ ప్రకటించామని, గత నాలుగేళ్లలో ఇదే అత్యధికమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment