
దీపావళి బరిలో ముగ్గురు టాప్ హీరోలు
2018 దీపావళికి కోలీవుడ్ తెరపై భారీ పోరు జరగనుంది. తమిళనాట విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు టాప్ హీరోలు ఒకే సీజన్ లో తమ సినిమాలతో బరిలో దిగుతున్నారు. దీంతో ఇప్పటి నుంచే ఆ సినిమాలపై చర్చ మొదలైంది. ఈ లిస్ట్ లో అందరికంటే ముందున్న హీరో విజయ్. గతంలో మురగదాస్ కాంబినేషన్‌లో తుపాకీ, కత్తి సినిమాలతో దీపావళి సీజన్‌లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఘన విజయాలు సాధించాడు. ఇప్పుడు మరోసారి అదే ఫీట్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
మరో స్టార్ హీరో సూర్య కూడా దీపావళి సీజన్ నే టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పటికే సెల‍్వరాఘవన్ దర్వకత‍్వంలో సినిమాను స్టార్ట్ చేసిన సూర్య తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఈ సినిమాను దీపావళి సీజన్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. మరో కోలీవుడ్ టాప్ హీరో అజిత్ కూడా అదే సీజన్ ను టార్గెట్ చేస్తున్నాడు. మరోసారి శివ దర్శకత్వంలో విశ్వాసం సినిమాలో నటిస్తున్న అజిత్ ఈ సినిమాతో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఈ ముగ్గురు హీరోలు అనుకున్నట్టుగా ఒకేసారి బరిలో దిగుతారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment