
సూర్య
దీపావళికి థియేటర్స్‌లోకి ‘ఎన్‌జీకే’ రావడం లేదా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఎన్‌జీకే’ (నందగోపాలకుమారన్). తెలుగు వెర్షన్‌కి ‘నందగోపాలకృష్ణ’ అని టైటిల్ ఫిక్స్ చేశారు టీమ్. ఇందులో సాయి పల్లవి, రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ దర్శకుడు సెల్వరాఘవన్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారట. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని, ‘ఎన్‌జీకే’ దీపావళికి రిలీజ్ కావడం లేదని అంటున్నారు చెన్నై సినీ జనాలు.
కానీ ఈ విషయంపై సెల్వరాఘవన్ స్పందించారు. ‘‘నేను బాగానే ఉన్నాను. మరో రెండు రోజుల్లో ‘ఎన్‌జీకే’ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాం. నా బాగు కోరిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. కానీ ‘ఎన్‌జీకే’ రిలీజ్ గురించి మాత్రం స్పందించలేదు. దీంతో ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో కానీ లేదా వచ్చే ఏడాది మొదట్లో కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సంగతి ఇలా ఉంచితే.. విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్కార్’ని దీపావళికి రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. ‘ఎన్‌జీకే’ వాయిదా పడితే.. సూర్య, విజయ్‌ల సినిమాలకు క్లాష్ తప్పినట్లే.
Comments
Please login to add a commentAdd a comment