పండగ వస్తోందంటే ఊరూవాడా సందడే సందడి. అందులోనూ దీపావళి అంటే చెప్పనక్కర్లేదు. సాధారణంగా వేడుకలు మన సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తు చేస్తాయి. సంస్కృతితో పాటు చరిత్రను కూడా గుర్తుకు తెచ్చే వేడుక దీపావళి. ఇదే పేరుతో జిల్లాలో రెండు ఊళ్లు ఉన్నాయి. దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాల్సిందే. అంతే కాదు.. దేశమంతా పండగ జరుపుకునే వేళ ఒక ఊరు మాత్రం దీపాలు వెలిగించకుండా అమావాస్య చీకటిలోనే గడిపేస్తుంది. ఆ చీకటి వెనుకా ఓ కథ దాగి ఉంది.
గార, టెక్కలి:
దీపావళి.. అందరికీ ఇది పండగ పేరు. జిల్లాలో రెండు ఊళ్లకు మాత్రం సొంత పేరు. శ్రీకాకుళం పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో దీపావళి అనే గ్రామం ఉంది. అలాగే టెక్కలి మండలంలోని అయోధ్యపురం పంచాయతీలోనూ దీపావళి అనే గ్రామం ఉంది. శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన కళింగ రాజు గార మండలంలో ఈ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టినట్లు చరిత్ర చెబుతోంది. స్థానికుల కథనం మేరకు.. రాజు ప్రతి రోజూ గుర్రంపై శ్రీకాకుళం నుంచి కళింగపట్నం వరకు ఉన్న మట్టి రోడ్డు గుండా వెళ్తుండేవారు.
మార్గమధ్యంలో శ్రీకూర్మం సమీపంలో లక్ష్మీనారాయణ గుడి వద్ద ఆగి స్వామి దర్శ నం అనంతరం కళింగపట్నం వెళ్లి మళ్లీ వచ్చే సమయంలో కూడా దర్శనం చేసుకునేవారు. ఒక రోజు గుర్రంపై వెళ్లి వస్తుండగా గుడి వద్దకు వచ్చేసరికి సొమ్మసిల్లి పడిపోయారు. లక్ష్మీనారాయణ గుడి వద్దనున్న వైష్ణవులు, గోవుల కాపరులు రాజుకి సపర్యలు చేసి గుడివద్దనున్న బావిలో నీరు ఇచ్చి మెలకువ వచ్చేవరకు సపర్యలు చేశారు. రాజు మేలుకుని తనకు సాయం చేసిన వారికి ఊరి పేరు అడగ్గా.. తమ ఊరికి పేరు లేదని వారు చెబుతా రు. ఈ సంఘటన దీపావళి నాడు జరగడంతో రాజు ఆ ఊరికి దీపావళి అనే పేరు పెట్టినట్లు చెబుతుంటారు. రికార్డుల్లో కూడా దీపావళిగా నమోదు చేస్తామని చెప్పి అప్పటివరకు ఉన్న పన్నులన్నీ రద్దు చేస్తున్నానని ప్రకటించి ఆ విధంగా చర్యలు తీసుకున్నారు. అప్పటినుంచి ఈ గ్రామం దీపావళి పేరుగానే కొనసాగడంతో పాటు రెవెన్యూ రికార్డుల్లో కూడా అదే పేరు ఉంది.
టెక్కలి మండలంలో..
టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ పరిధిలో కూడా ‘దీపావళి’ గ్రామం ఉంది. ఈ గ్రామంలో మొత్తం 50 కుటుంబాలు జీవనం సాగి స్తున్నాయి. దీపావళి పేరుతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు చోటు చేసుకుంది.
దీపావళి పేరు ఎంతో సంతోషం
హిందువులకు ఎంతో ముఖ్యమైన దీపావళి పండగ పేరు మా గ్రామానికి ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి గ్రామంలో జని్మంచడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. దీపావళిని ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటాం.
– శ్రీ రంగం మధుసూదనరావు, విశ్వహిందూపరిషత్ కార్యదర్శి, దీపావళి
Comments
Please login to add a commentAdd a comment